ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్రీడా పాలసీపై చర్చించేందుకు బుధవారం తొలిసారిగా సబ్‌కమిటీ భేటీ జరగనుందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, క్రీడాకారులకు కల్పించాల్సిన ప్రోత్సాహకాలపై చర్చిస్తామన్నారు. దేశంలోని క్రీడా రంగంలో రాష్ట్రాన్ని నంబరు వన్‌గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. రవీంద్రభారతిలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన సలహాలు, సూచనల కోసం రాష్ట్రంలోని సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లు, స్పోర్ట్స్ జర్నలిస్టులు, క్రీడా సంఘాలు, క్రీడా అవార్డు గ్రహీతలతో చర్చిస్తాం.ఇతర రాష్ట్రాలు, దేశాల క్రీడా పాలసీలను సైతం అధ్యయనం చేసి మెరుగైన క్రీడా పాలసీ రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పిస్తాం.
-మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇదీ చూడండి: ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్