ETV Bharat / state

'వాటికి ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించండి' - minister srinivas goud review latest news

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని (సెప్టెంబర్ 27) తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని అధికారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.27.50 లక్షలను మంజూరు చేసిందని స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు.

'చరిత్రాత్మక, పర్యాటక ప్రదేశాలకు ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలి'

author img

By

Published : Jul 31, 2021, 10:43 PM IST

హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పర్యాటక, హెరిటేజ్‌పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని (సెప్టెంబర్ 27) తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వేడుకల కోసం సీఎం కేసీఆర్ రూ.27.50 లక్షలను మంజూరు చేశారని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉన్న చరిత్రాత్మక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలకు తగిన ప్రచారం నిర్వహించేందుకు పర్యాటక, హెరిటేజ్ తెలంగాణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రణాళికలను రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి తగిన ప్రచారం కల్పించాలన్నారు. రాష్ట్రంలో రామప్ప దేవాలయంతో పాటు అనేక ప్రపంచ స్థాయి చారిత్రక కట్టడాలు ఉన్నాయని.. వాటిని గుర్తించి తగిన ప్రతిపాదనలను తయారు చేసి యునెస్కోకు సమర్పించాల్సిందిగా అధికారులను కోరారు.

జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలి..

పర్యాటక ప్రాంతాల ప్రచారంలో భాగంగా ఎయిర్​పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్​లలోని హోర్డింగ్​ల ద్వారా అవసరమైన ప్రచారాన్ని నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆయా జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలపై బ్రోచర్ల ద్వారా ప్రచార సామగ్రిని ముద్రించి వాటికి విశేష ప్రాచుర్యం కల్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శికి మంత్రి సూచించారు.

ప్రతిపాదనలను సెప్టెంబర్ 4లోగా అందజేయాలి..

2021 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అవార్డులను రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధికి విశేష కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు వివిధ విభాగాల్లో అవార్డులు అందజేస్తామన్నారు. అందుకు పర్యాటక శాఖ వెబ్​సైట్ www.telanganatourism.gov.in లో వివరాలను డౌన్​లోడ్ చేసుకొని ప్రతిపాదనలను సెప్టెంబర్ 4లోగా పర్యాటక శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. 2020 సంవత్సరంలో కరోనా కారణంగా ఇవ్వలేకపోయిన అవార్డులను ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందజేస్తామని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, పర్యాటకాభివృద్ది సంస్థ ఎండీ మనోహర్, ఈడీ శంకర్ రెడ్డి, టూరిజం అధికారులు ఓం ప్రకాశ్​, మహేశ్​, హెరిటేజ్ తెలంగాణ శాఖ అధికారులు నారాయణ, రాములు నాయక్, మాధవి, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

TS Cabinet Meeting: రేపు మంత్రి వర్గ సమావేశం... దళితబంధు పథకమే ప్రధాన అజెండా

SRINIVAS GOUD: 'దేశానికే తలమానికంగా రామప్పను తీర్చిదిద్దుతాం'

cm kcr: రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్‌ హర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.