ETV Bharat / state

'కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. కురుమూర్తి జాతర జరుపుకుందాం'

మహబూబ్​నగర్ జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

'కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. కురుమూర్తి జాతర జరుపుకుందాం'
'కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. కురుమూర్తి జాతర జరుపుకుందాం'
author img

By

Published : Nov 9, 2020, 5:15 AM IST

ఈనెల 16 నుంచి ప్రారంభంకానున్న కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హైందవ సంప్రదాయం ప్రకారం భక్తి , శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

దేవాలయ పరిసరాలను రసాయన ద్రావకాల పిచికారికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టితో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని నిర్దేశించారు. జాతర పరిసరాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా గకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.

ఉత్సవాల ఏర్పాటు విషయమై ప్రతిరోజు సంబంధిత జిల్లా అధికాలు కురుమూర్తి స్వామి దేవాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కురుమూర్తి స్వామి జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.

ఇవీచూడండి: మానవ తప్పిదాలతోనే ప్రకృతి విలయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.