ETV Bharat / state

'రాష్ట్రాన్ని క్రీడా హబ్​గా మారుస్తాం'

author img

By

Published : Feb 8, 2020, 8:14 AM IST

Updated : Feb 8, 2020, 12:28 PM IST

రానున్న రోజుల్లో క్రీడల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని క్రీడా హబ్​గా మారుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్​ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం, సాగునీటి ప్రాజెక్టులున్న ప్రాంతంలో పర్యాటక ప్రాంతాలని అభివృద్దిపర్చాలని అధికారులను ఆదేశించారు.

minister srinivas goud review meeting
'రాష్ట్రాన్ని క్రీడా హబ్​గా మారుస్తాం'

తెలంగాణను క్రీడాహబ్​గా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేడియాలను క్రీడల కోసమే ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాశాఖ ఆదాయ వనరులు పెంచుకునేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. క్రీడాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర భారతిలోని తన ఛాంబర్​లో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పోర్ట్స్ వసతి గృహాల్లో మౌళిక వసతులు పెంచుతూ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయ్యాలని ఆదేశించారు.

టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయండి: మంత్రి

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పెండింగ్​లో ఉన్న టూరిజం ప్రాజెక్టులన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ అభివృద్ధిపై పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన ఛాంబర్​లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని హరిత రెస్టారెంట్​లను ఆధునీకరించాలన్నారు. విమానాశ్రయంలోనూ టూరిజం స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

క్రీడా ప్రాంగణాలను పీపీపీ విధానంలో ఆధునీకరించి ఆదాయ వనరులుగా మార్చేందుకు కృషి చేయాలన్నారు.

Last Updated : Feb 8, 2020, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.