తనపై చేసిన ఆరోపణలు రుజువైతే అన్ని పదవులకు రాజీనామా చేస్తానని... లేకపోతే బండి సంజయ్ రాజీనామా చేస్తారా అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సవాల్ విసిరారు. బండి సంజయ్ చెప్పిన సర్వే నంబర్లో పట్టా భూమి లేకుంటే తన ఆస్తి మొత్తం దానం చేస్తానని వెల్లడించారు. తాము కష్టపడి కొనుకున్నామని... అమ్మినవాళ్లు కూడా ఇంకా బతికే ఉన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 2014కు ముందు... ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఎలా ఉందో సంజయ్ తెలుసుకోవాలన్నారు.
భాజపా నాయకులు చేసింది చాలా ఉందని మేము బయటకు తీస్తే వారి బండారం బయటపడుతుందన్నారు. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని.. తనకున్న మంచి పేరును నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గురించి మాట్లాడేందుకు భయపడే రోజుల్లోనే సంఘాలు పెట్టి కొట్లాడినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'కబ్జాలకు పాల్పడ్డ మంత్రులందరిపై విచారణ చేపట్టాలి '