ETV Bharat / state

Srinivas goud on Sports: 'క్రీడా పాఠశాలల్లో 240 సీట్ల భర్తీకి షెడ్యూల్​' - telangana news

Srinivas goud on Sports: ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు రాష్ట్రంలో దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని అమలు చేయబోతున్నామని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ వెల్లడించారు. హాకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్​లలో గల క్రీడా పాఠశాలల్లో 4వ, 5వ తరగతుల్లో 15 క్రీడా విభాగాలలో మొత్తం 240 సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ను విడుదల చేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Srinivas goud on Sports: 'క్రీడా పాఠశాలల్లో 240 సీట్ల భర్తీకి నోటిఫికేషన్​'

author img

By

Published : Feb 6, 2022, 5:27 PM IST

Srinivas goud on Sports: తెలంగాణ రాష్ట్రానికి, దేశానికీ వన్నె తెచ్చే క్రీడాకారులను తయారుచేసే క్రీడా కర్మాగారంగా క్రీడా పాఠశాలలను తయారు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడాపాలసీని రూపొందిస్తున్నామన్నారు. త్వరలో క్రీడాపాలసీ డ్రాఫ్ట్​ను కేబినెట్​లో ఆమోదం చేసుకొని దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని అమలు చేయబోతున్నామన్నారు. క్రీడాకారులను, కోచ్​లకు ఈ పాలసీలో ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం కొవిడ్ కారణంగా 2021-22 విద్యా సంవత్సరంలో 4వ తరగతి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు.

ఈ విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలు హాకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్​లలో 4వ, 5వ తరగతుల్లో 15 క్రీడా విభాగాలలో మొత్తం 240 సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ను విడుదల చేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హాకీంపేట్​, కరీంనగర్, ఆదిలాబాద్​లలో ఉన్న క్రీడా పాఠశాలల్లో 4వ, 5వ తరగతుల్లో బాలుర, బాలికల కోసం 20సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లను భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేశామని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్లు పారదర్శకంగా జరపాలని క్రీడా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.