ప్రతి వైద్యుడు నెలలో ఒక్కరోజైన ఉచిత సేవ చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. తెరాస నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి ప్రారంభించారు. నగరంలోని ఆస్పత్రులు, వైద్యులు మురికివాడల్లో సేవలందించేందుకు ముందుకురావాలన్నారు. రక్తదానం చేసిన వారిని మంత్రి అభినందించారు.
ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై