కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన ముందస్తు చర్యలపై క్రీడా, హెరిటేజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యాటక హోటళ్లు, బోటింగ్‌లు, బార్లు, జిమ్‌లు ప్రైవేట్ ఈత కొలనులు, క్రీడా మైదానాలు మూసివేయాలని మంత్రి కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం విడుదల చేసిన నియమ నిబంధనలను విధిగా పాటించాలని ఆదేశించారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన చర్యలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటకుల పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి.. తిరుమలను తాకిన కరోనా ప్రభావం.. తగ్గిన భక్తుల రద్దీ