ETV Bharat / state

మంత్రి శ్రీనివాస్​ గౌడ్ కర్రసాము అదుర్స్ - Minister Srinivas Goud visited the curriculum training camp in Rabindra Bharat.

తెలంగాణలో మహిళలకు పూర్తి భద్రత, స్వేచ్ఛ ఉందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్ అన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని సూచించారు. రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న కర్రసాము శిక్షణా శిబిరాన్ని సందర్శించారు.

Minister Srinivas Goud karra samu at hyderabad
కర్రసాము చేస్తున్న మంత్రి శ్రీనివాస్​ గౌడ్
author img

By

Published : Dec 23, 2019, 6:13 AM IST

Updated : Dec 23, 2019, 7:37 AM IST

హైదరాబాద్​ రవీంద్రభారతి ప్రాంగణంలో నిర్వహిస్తున్న కర్రసాము శిక్షణా శిబిరాన్ని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ సందర్శించారు. మహిళలకు ఆత్మరక్షణ, ధైర్య సాహసాలు పెంపొందించే దిశగా ఈ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

కర్రసాములో పీహెచ్​డీ చేసిన ఆకుల శ్రీధర్ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. స్వయంగా కర్రసాము, సెల్ఫ్ డిఫెన్స్​లపై విద్యార్థులకు మంత్రి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

కర్రసాము చేస్తున్న మంత్రి శ్రీనివాస్​ గౌడ్

ఇదీ చూడండి : పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...

sample description
Last Updated : Dec 23, 2019, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.