ETV Bharat / state

ఎల్బీ స్టేడియంలో వివాదాన్ని పరిష్కరించండి: శ్రీనివాస్​గౌడ్ - క్రీడాకారుల సమస్యను పరిష్కరించాలని మంత్రి ఆదేశం

హైదరాబాద్​లోని ఎల్బీస్టేడియంలో బాస్కెట్​బాల్​, స్కేటింగ్​ మైదానం వినియోగంపై నెలకొన్న వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అధికారులను ఆదేశించారు. రెండు క్రీడలకు చెందిన ప్లేయర్ల మధ్య కొంతకాలంగా గొడవ నడుస్తోంది. దీనిపై రవీంద్రభారతిలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

minister srinivas goud  given orders to solve problem of players in lb stadium
రవీంద్రభారతిలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
author img

By

Published : Jan 16, 2021, 10:14 PM IST

బాస్కెట్​ బాల్, స్కేటింగ్ క్రీడాకారుల మైదానం వినియోగంపై తలెత్తిన వివాదంపై రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్​గౌడ్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తక్షణమే వివాదాన్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెండు క్రీడలకు చెందిన ప్లేయర్ల మధ్య కొంతకాలంగా గ్రౌండ్ వాడకంపై వివాదం నడుస్తోంది.

ఈ రోజు నిర్వహించిన సమీక్షలో రెండు క్రీడలకు చెందిన ప్లేయర్లు మంత్రిని కలిసి సమస్యను వివరించారు. ఈ వివాదానికి సరైన పరిష్కారం చూపాలని మంత్రిని కోరారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి వెంటనే సమస్యను పరిష్కరించాలని క్రీడాశాఖ కార్యదర్శి శ్రీనివాస్​రాజును ఆదేశించారు.

ఇదీ చూడండి : గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: సీఎస్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.