ETV Bharat / state

Minister Srinivas Goud Fire on BJP: 'కేసీఆర్‌ను అరెస్టు చేస్తారా... టచ్​ చేసి చూడండి' - cm kcr

Minister Srinivas Goud Fire on BJP: రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా.. అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భాజపానుద్దేశించి అన్నారు. ఆయన్ను ముట్టుకునే దమ్ము, ధైర్యం దేశంలో ఎవరికీ లేవన్నారు.

Minister Srinivas Goud Fire on BJP
'కేసీఆర్‌ను అరెస్టు చేస్తారా... టచ్​ చేసి చూడండి'
author img

By

Published : Jan 20, 2022, 9:39 AM IST

'కేసీఆర్‌ను అరెస్టు చేస్తారా... టచ్​ చేసి చూడండి'

Minister Srinivas Goud Fire on BJP: ముఖ్యమంత్రి కేసీఆర్​ను అరెస్టు చేస్తామని ప్రకటిస్తున్న విపక్ష నేతలకు ఆయన్ను ముట్టుకునే ధైర్యం ఉందా? అని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. కేసీఆర్​ను అరెస్టు చేస్తే రాష్ట్రం యావత్తూ అట్టుడుకుతుందని హెచ్చరించారు.

తెలంగాణలో 70 ఏళ్లల్లో జరగని అభివృద్ధిని చేసినందుకు కేసీఆర్​ను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 317 జీవోను రద్దు చేయాలని భాజపా శ్రేణుల మంత్రి కాన్వాయ్​ను అడ్డుకోవడంపై శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంటలో రూ.41 కోట్లతో నిర్మించనున్న వారధితో కూడిన చెక్‌డ్యాం పనులకు బుధవారం భూమిపూజ చేసి మాట్లాడారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేసినందుకు, దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు పరుస్తునందుకు జైల్లో పెడతారా అని ప్రశ్నించారు.

కేసీఆర్​ను జైల్లో పెడతారా... అసలు ఆయన్ను ముట్టుకునే దమ్ము, ధైర్యం దేశంలో ఎవరికీ లేదు.. ఒకవేళ జైల్లో పెడితే.. రాష్ట్రం.. కాదు... దేశమే అల్లకల్లోలం అవుతుంది. ఎందుకు జైల్లో పెడతారు.. అభివృద్ధి చేసినందుకా...? టచ్​ చేసి చూడండి...

- మంత్రి శ్రీనివాస్​ గౌడ్

ఇదీ చూడండి: కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు రెగ్యులర్​ మార్కెట్​ అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.