ETV Bharat / state

'సెంటిమెంట్లతో రాజ్యమేలడం తెలంగాణలో సాధ్యం కాదు' - BJP

తెరాస ప్రభుత్వంపై  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ చేసిన ఆరోపణలపై మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తీవ్రంగా స్పందించారు.  కేసీఆర్, కేటీఆర్ ను విమర్శిస్తే తమ పార్టీ బలపడుతుందన్న భ్రమతో భాజపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

TRS
author img

By

Published : Aug 24, 2019, 6:58 PM IST

'సెంటిమెంట్లతో రాజ్యమేలడం తెలంగాణలో సాధ్యం కాదు'

కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని విద్యుత్ అధికారుల మనోభావాలను దెబ్బతీసేలా.. బ్లాక్ మెయిలింగ్ ధోరణితో భాజపా నేతలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కష్టపడి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న అధికారులు... భయపడి ఉద్యోగాలు చేయాలా అని ప్రశ్నించారు. ప్రధాని, ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు, అధికారులు ఓ వైపు తెలంగాణ పథకాలను ప్రశంసిస్తుంటుంటే... రాష్ట్ర నాయకులు వాటిని మరిచిపోయి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సెంటిమెంట్లతో రాజ్యమేలడం ఉత్తరాదిలో సాధ్యమేమో కానీ.. తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ సెంటిమెంట్ మాత్రమే ఉంటుందన్నారు. దేవాలయాల పేరుతో రాజకీయాలు చేయడం కాదని.. యాదాద్రి వంటి ఒక్క గుడి కట్టారా అని ప్రశ్నించారు. సభ్యత్వ నమోదు కోసం భాజపా మాదిరిగా మిస్ట్ డ్ కాల్ విధానం అనుసరిస్తే.. తెరాసకు గంటలో మూడు కోట్ల మంది చేరతారన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణకు ఏం చేస్తారో చెప్పకుండా.. పథకాలపై పడి ఏడ్వడం సబబు కాదని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:'రాజ్యాంగ సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.