ప్రపంచవ్యాప్తంగా భద్రత నగరం అంటే హైదరాబాద్ అనే విధంగా భాగ్యనగరాన్ని తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గతంలో పారిశుద్ధ్య కార్మికుల జీవనం గడ్డుగా ఉండేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి జీవితాలు బాగుపడ్డాయని ఆయన తెలిపారు. ఆరేళ్లలో వారి జీతాలు రెండింతలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు కార్మికులు పాలాభిషేకం చేశారు.
నగరంలో సుఖ సంతోషాలతో జీవించే పరిస్థితులను ప్రభుత్వం నెలకొల్పిందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎర్రగడ్డలో అగ్ని ప్రమాదం.. రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం