ETV Bharat / state

'ఏ ప్రభుత్వం కూడా పీవీకి సరైన గౌరవం ఇవ్వలేదు' - తెలంగాణ అసెంబ్లీ వార్తలు

దేశాన్ని పరిపాలించిన ఏ ప్రభుత్వం కూడా ప్రధానిగా సేవలు అందించిన పీవీకి సరైనా గౌరవం ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా తర్వాతనే ఆయన గురించి ప్రపంచానికి తెలుస్తోందని... ఆయన పుట్టిన ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.

minister-srinivas-goud-about-pv-narasimha-rao-in-assembly-monsoon-session-2020
'ఏ ప్రభుత్వం కూడా పీవీకి సరైన గౌరవం ఇవ్వలేదు'
author img

By

Published : Sep 8, 2020, 1:36 PM IST

పట్వారీ నుంచి ప్రధానమంత్రిగా తన సేవలు అందించి... భారత దేశంలో అనేక సంస్కరణలు తెచ్చి... దేశానికే వన్నే తెచ్చిన తెలంగాణ బిడ్డకు సరైన గౌరవం దక్కలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పీవీకి గౌరవం తెచ్చే విధంగా... ఆయనకు భారతరత్న ఇవ్వాలని, పార్లమెంటులో పీవీ చిత్రపటం పెట్టాలనే ప్రతిపాదనను తెచ్చిందని తెలిపారు.

'ఏ ప్రభుత్వం కూడా పీవీకి సరైన గౌరవం ఇవ్వలేదు'

పీవీకి ఉన్న అపారమైన జ్ఞానంతో అనే సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి తెలిపారు. ఎంతోమంది వైతాళికులు కనుమరుగైన సంఘటనలు గతంలో చూశామని... ప్రత్యేక రాష్ట్రం వచ్చి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారందరికి గౌరవం ఇస్తూ... ఉత్సవాలు చేస్తోందని పేర్కొన్నారు. దేశాన్ని పరిపాలించిన ఏ ప్రభుత్వాలు కూడా పీవీకి సరైనా గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పుట్టిన ప్రాంతాలను పర్యటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి: పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి: భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.