ETV Bharat / state

వృద్ధ కళాకారుల పింఛన్ రూ.3016కి పెంపు - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో వృద్ధ కళాకారుల పింఛన్‌ను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇది జూన్ రెండో తేది నుంచి అమల్లోకి రానుందని వెల్లడించారు. కళాప్రదర్శనలకు జీవితాన్ని అంకితం చేస్తున్న కళాకారులకు రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం అందిస్తున్న కానుక అని అన్నారు.

minister srinivas goud, pensions
మంత్రి శ్రీనివాస్ గౌడ్, కళాకారుల పింఛన్లు
author img

By

Published : May 28, 2021, 6:36 AM IST

రాష్ట్రంలో వృద్ధ కళాకారుల పింఛన్‌ను రూ.1500 నుంచి రూ.3016కి పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని.. ఇది జూన్‌ రెండో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. దీని ద్వారా 2661 మందికి లబ్ధి చేకూరుతుందని గురువారం ఆయన తమ కార్యాలయంలో వెల్లడించారు. జీవితాంతం కళాప్రదర్శనలకు జీవితాన్ని అంకితం చేస్తున్న కళాకారులకు రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం అందిస్తున్న కానుక అని తెలిపారు. ఒకేసారి వారి పింఛన్‌ను రెట్టింపు చేసిన కేసీఆర్‌కు కళాకారులు, వారి కుటుంబాల తరఫున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కళాప్రియుడు, సాహితీవేత్త, కళాకారులంటే ఎంతో గౌరవం గల సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వారి సంక్షేమానికి విస్తృతస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

సాంస్కృతిక సారథిలో 550 మందికి ఉద్యోగాలు

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారుల కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి అనే వ్యవస్థను ఏర్పాటు చేసి 550మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. వీరికి వేతనాల రూపేణా యేటా రూ.16.17 కోట్లను చెల్లిస్తున్నామన్నారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పునః ఎంపిక కోసం నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ ఇటీవలే అర్హులైనవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలను వెల్లడించిందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, సంచాలకుడు హరికృష్ణ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Ntr birthday: నందమూరి అభిమానులకు తెదేపా సర్​ప్రైజ్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.