ETV Bharat / state

తాగు నీటి ఎద్దడి నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవాలి : మంత్రి సీతక్క - మేడారం జాతరపై రివ్యూ మీటింగ్

Minister Seethakka Review Meeting in Hyderabad : వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారణ కోసం తగిన చర్యలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించింది. అదే విధంగా జరిగే మేడారం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Minister Seethakka Review Meeting in Hyderabad
Minister Seethakka Review Meeting on Mission Bhagiratha
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 9:23 PM IST

Minister Seethakka Review Meeting in Hyderabad : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా పరిస్థితిని ప్రతి రోజూ నిశితంగా పర్యవేక్షించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) అన్నారు. హైదరాబాద్‌లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Minister Seethakka Review Meeting on Mission Bhagiratha : మిషన్ భగీరథ శాఖ లక్ష్యాలు, కార్యకలాపాల గురించి పూర్తి స్థాయిలో ముఖ్య కార్యదర్శి స్మిత సభర్వాల్ మంత్రి సీతక్కకు వివరించారు. రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అదేశించారు. రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామానికి రోజువారీ తాగు నీటి సరఫరా జరిగేలా చూడాలని సూచించారు.

గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క - ములుగులో సంబురాలు చేసుకున్న కాంగ్రెస్​ శ్రేణులు

Minister Seethakka Latest Meeting : రిజర్వాయర్లు, నదుల తదితర తాగునీటి వనరుల స్థాయిలు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క సూచించారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని అన్నారు. ఏదైన సమస్య తలెత్తితే నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. భగీరథ ప్రాముఖ్యత(Importance of Mission Bhagiratha)పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని సీఈలు, ఎస్‌ఈలకు మంత్రి అనసూయ సూచించారు. గ్రామాల్లో తాగు నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అన్నారు.

మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి : సీతక్క

Minister Seethakka Review on Medaram Jathara : అనంతరం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 21న జరిగే మేడారం జాతర(Medaram Jathara 2024)కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. పండగను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే జాతర ఏర్పాట్ల కోసం రూ.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు సిద్దం చేయాలని తెలిపారు. ఈ జాతరను జాతీయ పండుగ హొదా కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలో మేడారం జాతరపై ఆయా ప్రభుత్వ శాఖలతో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మిషన్‌ భగీరథ కార్యదర్శి స్మిత సభర్వాల్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కృపాకర్‌ రెడ్డితో పాటు మిషన్‌ భగీరథ చీఫ్‌ ఇంజనీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Mission Bhagiratha : మీ ఇంటికి 'మిషన్ భగీరథ' నీళ్లు రావట్లేదా.. అయితే సర్పంచులకు చెప్పండి.!

ఫిబ్రవరి 21 నుంచి మేడారం మహా జాతర - ఏర్పాట్ల కోసం రూ.75 కోట్ల నిధుల విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.