మేడారం జాతరకు రండీ: సత్యవతి - జాతరకు రాండీ: మంత్రి
మేడారం జాతరకు అందరూ రావాలని రాష్ట్ర గిరిజన శాఖ రూపొందించిన ఆహ్వాన పత్రికతో పాటు పూల మొక్కను ఇచ్చి రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన నేతలను ఆహ్వానించారు. దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి అధ్యక్షతన 6వ గిరిజన సలహా మండలి(ట్రైబల్ అడ్వైజరి కౌన్సిల్) సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు అక్కడ ఉన్న గిరిజన నేతలు, అధికారులకు జాతర విశేషాలను మంత్రి తెలియజేశారు.