ప్రేమను మమకారాన్ని పంచడంలో తల్లిని మించిన వారు ఎవరూ ఉండరని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్బంగా ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యలక్ష్మీ పథకం ద్వారా తల్లీ బిడ్డల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానే కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు.
తెరాస ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తల్లిదండ్రులు కరోనా బారిన పడిన కుటుంబాల్లో ప్రభుత్వమే యోగక్షేమాల బాధ్యత తీసుకుందని మంత్రి వివరించారు.
ఇదీ చదవండి: మథర్స్ డే: కొవిడ్ నుంచి కుటుంబాన్ని కాపాడుకున్న తల్లులు