ETV Bharat / state

ఐఐఎంలో సీటు సాధించిన గిరిజన విద్యార్థులను అభినందించిన మంత్రి సత్యవతి - మంత్రి సత్యవతి రాఠోడ్​ వార్తలు

నాణ్యమైన విద్య ద్వారా పేద వర్గాల వెనుకబాటుతనం నిర్మూలన అవుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ అన్నారు. ఐఐఎంలో సీటు సాధించిన ఇద్దరు గిరిజన విద్యార్థులను అభినందించారు.

Telangana news
గిరిజన విద్యార్థులు ఐఐఎంలో సీటు
author img

By

Published : Jun 1, 2021, 8:58 PM IST

పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్​ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. గిరిజన గురుకుల డిగ్రీ విద్యార్థులు బదావత్ సోని, రాఠోడ్ నరేశ్... దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్​మెంట్​ (ఐఐఎం)లో సీటు సాధించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌కు చెందిన బదావత్ సోని తల్లిదండ్రులు ఆటో డ్రైవర్​, దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్​ పాఠశాలలో పదో తరగతి చదివిన సోని.. గిరిజన గురుకులంలో చదివి ఐఐఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ 2021-22కు సీటు సాధించిందన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన రాఠోడ్ నరేశ్​ తల్లిదండ్రులిద్దరూ దినసరి వేతన కూలీలని... సంగారెడ్డిలోని జడ్పీ స్కూల్​లో చదివి వైజాగ్​ ఐఐఎంలో సీటు సాధించినట్లు తెలిపారు.

ఐఐఎంలలో సీట్లు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల పారితోషికంతో పాటు, ల్యాప్​టాప్ ఇస్తామని తెలిపారు. అంతే కాకుండా ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, మెస్​ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.

గిరిజన గురుకులాల్లో విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ఉత్తమ విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాట్, జీఆర్ఈ, టోఫెల్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తోందన్నారు. ఫలితంగా ఇద్దరు విద్యార్థులు ఐఐటీ, పీహెచ్​డీలో సీటు సాధించగా... మరో 110 మంది వివిధ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందారని వెల్లడించారు.

ఇదీ చూడండి: Minister Harish Rao: వరికి బదులు పత్తి, కంది సాగు చేయండి: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.