ETV Bharat / state

'మహిళలు, బాలలపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదు'

అమీన్​పూర్​ ఘటనపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, బాలలపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. మారుతి బాలల సంరక్షణ కేంద్రాన్ని మూసివేశామన్నారు. ఈ ఘటనపై ప్రత్యేధికారిని నియమించి విచారణ చేయిస్తున్నట్లు వెల్లడించారు.

minister-satyavathi-rathod-spoke-on-ameenpur-issue
'మహిళలు, బాలలపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదు'
author img

By

Published : Aug 18, 2020, 9:59 PM IST

రాష్ట్రంలో మహిళలు, బాలలపై దాడులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని... తీవ్రమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని మారుతి బాలల సంరక్షణ కేంద్రంలో 14ఏళ్ల బాలికపై లైంగిక దాడి...ఆ బాలిక మృతికి కారణమైన ఆ కేంద్రాన్ని మూసివేయించామన్నారు. ఘటనకు కారణమైన ముగ్గురిని గుర్తించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని తెలిపారు. ఈ కేసును క్షుణ్ణంగా విచారించేందుకు ఏసీపీ స్థాయికి తగ్గకుండా ప్రత్యేక అధికారిని నియమించాలని డీజీపీని కోరడం వల్ల ఆయన ప్రత్యేక అధికారిని నియమించి విచారణ చేయిస్తున్నట్లు మంత్రి వివరించారు. పోలీసు విచారణతో పాటు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, బాలల సంక్షేమ కమిటీలోని ఇద్దరు సభ్యులు, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఎస్పీ, రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శితో ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ చేయిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కేసు గురించి ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు ఇస్తూ సహకరించడానికి నిపుణులైన న్యాయ సలహాదారుడిని నియమించామన్నారు. మారుతి బాలల సంరక్షణ కేంద్రాన్ని మూసివేయడంతో అక్కడున్న 47 మంది బాలికలను ప్రభుత్వ హోమ్​కు తరలించి, వారి సంపూర్ణ సంరక్షణ చేపట్టామని, కావల్సిన వసతులు కల్పిస్తున్నామన్నారు. అమీన్​పూర్ సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ బాలల సంరక్షణ కేంద్రాల్లో విధిగా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. అదేవిధంగా బాలలకు ఇబ్బందులు వస్తే వెంటనే ఫిర్యాదు చేసే విధంగా ప్రతి కేంద్రంలో 1098 నెంబర్​ను ప్రదర్శించాలని, మహిళా – శిశు సంక్షేమ శాఖ రూపొందించిన బాలల హక్కుల రక్షణ పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: కోర్​కమిటీ సమావేశం కోసం ఉత్తమ్​కు రెండోసారి వీహెచ్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.