ఖమ్మంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం, పెట్రోల్ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ బాధితురాలిని రెయిన్బో ఆస్పత్రిలో వైద్యం అందించాలని ఆదేశించారు.
ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య... స్వయంగా పర్యవేక్షిస్తూ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని మంత్రి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
ఇదీ చూడండి: గోదావరిలో దూకిన వివాహిత.. రక్షించిన జాలర్లు