ETV Bharat / state

ఆదివారాన్ని ఆహ్లాదవారంగా మార్చుకోవాలి: సత్యవతి రాఠోడ్​

ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో భాగంగా... మంత్రి సత్యవతి రాఠోడ్​ ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. తెలంగాణకు హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

minister sathyavathi rathode perform dry day in her home
ఆదివారాన్ని ఆహ్లాదవారంగా మార్చుకోవాలి: సత్యవతి రాఠోడ్​
author img

By

Published : Jul 12, 2020, 2:28 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమషాలు మీ కోసం కార్యక్రమంలో భాగంగా... ఇంటిని శుభ్రం చేశారు. పరిశుభ్రత పాటించి... ఆదివారాన్ని ఆహ్లాదవారంగా మార్చుకోవాలని సూచించారు.

సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా దోమలను నివారించాలని మంత్రి అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులు ధరించి కరోనా నుంచి కాపాడుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు ఆస్తులతోపాటు మంచి వాతావరణాన్ని ఇచ్చేందుకు... ముఖ్యమంత్రి కేసీఆర్​ సంకల్పించిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: పెద్దపల్లిలో లాక్​డౌన్​.. ఎన్ని రోజులో తెలుసా..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.