ETV Bharat / state

'గిరిజనుల రిజర్వేషన్లు 6.5 నుంచి 10 శాతానికి పెంచాలి' - మంత్రి సత్యవతి తాజా వార్తలు

గిరిజనుల రిజర్వేషన్లు 6.5 నుంచి 10 శాతానికి పెంచాలి: మంత్రి సత్యవతి

author img

By

Published : Sep 3, 2020, 2:41 PM IST

Updated : Sep 3, 2020, 3:20 PM IST

14:39 September 03

'గిరిజనుల రిజర్వేషన్లు 6.5 నుంచి 10 శాతానికి పెంచాలి'

రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జనాభాకు అనుగుణంగా 6.5 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర  ప్రభుత్వాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు. రిజర్వేషన్ల శాతాన్ని పెంచకపోవడం వల్ల చాలా మంది గిరిజన విద్యార్థులు, యువత.. విద్యలో, ఉద్యోగాల్లో నష్టపోతున్నారని వివరించారు. గిరిజన పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర  పరిశోధనల సంస్థల ఆధ్వర్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహిస్తోన్న రెండు రోజుల సమావేశంలో మంత్రి, అధికారులు పాల్గొన్నారు.  

ఇప్పటికే రివ్యూ పిటిషన్ వేశాం..

ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాలను స్థానికులతోనే భర్తి చేయాలని కోరారు. 20 ఏళ్ల క్రితం ఇచ్చిన మూడో నంబర్ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసిందని... దీనిపై ఇప్పటికే రివ్యూ పిటిషన్ వేశామని తెలిపారు. కేంద్రం నుంచి తగిన మద్దతివ్వాలని సత్యవతి రాఠోడ్ విజ్ఞప్తి చేశారు.  

గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేసిందని... ఆంధ్రప్రదేశ్​లో వర్సిటీ  ప్రారంభమైనా ఇక్కడ ఇంకా ప్రారంభం కాలేదని మంత్రి సత్యవతి తెలిపారు. వీలైనంత త్వరగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలని కోరారు. రాష్ట్రానికి మరిన్ని ఏకలవ్య గురుకులాలను మంజూరు చేయాలని, ఇప్పటికే ఇచ్చిన మినీ గురుకులాలకు రెన్యువల్స్  ఇవ్వడంతో పాటు కొత్తవాటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గురుకులాల సొసైటీ సమర్థంగా పనిచేస్తోందని... మినీగురుకులాలను ఎన్జీవోల ఆధ్వర్యంలో కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించే అవకాశం ఇవ్వాలన్నారు. పెండింగ్​లో ఉన్న గిరిజన బడ్జెట్ నిధులను త్వరగా ఇవ్వాలని... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలకు కేంద్రం నుంచి తగిన మద్దతు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  

ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

Last Updated : Sep 3, 2020, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.