ETV Bharat / state

'భాషా పండితుల పదోన్నతికి ప్రభుత్వం సుముఖం' - language teachers latest updates

భాషోపాధ్యాయులకు స్కూల్​ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు భాషోపాధ్యాయ సంస్థ సభ్యులతో తన క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడారు.

'భాషా పండితుల పదోన్నతికి ప్రభుత్వం సుముఖం'
author img

By

Published : Jan 15, 2021, 5:03 PM IST

భాషోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వారికి స్కూల్​ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో భాషోపాధ్యాయ సంస్థ సభ్యులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా 2021 డైరీని ఆమె ఆవిష్కరించారు. అప్​గ్రేషన్​ పరంగా ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా వారు చేసిన సూచనపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్​, కార్యదర్శి గౌరీ శంకర రావు, రాష్ట్ర బాధ్యులు పెండ్యాల బ్రహ్మయ్య, షేక్​ హాజీ నూరానీ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రామాలయానికి తొలి విరాళం అందించిన రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.