ETV Bharat / state

పాఠశాలలు తెరిచే వరకు ప్రైవేట్ టీచర్లకు సాయం: సబిత - ప్రైవేట్ ఉపాధ్యాయులకు రేషన్

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు రేషన్ పంపిణీ వెంటనే ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లోగా వారికి లబ్ధి చేకూరేలా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.

minister sabitha indrareddy
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
author img

By

Published : May 10, 2021, 7:48 PM IST

రాష్ట్రంలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థికసాయం, ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలు మళ్లీ తెరిచే వరకు సాయం అందుతుందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంతో మరో 83,993 మందికి వర్తింపజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా వారికి లబ్ధి చేకూరేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే రూ.25 కోట్లు వెచ్చించి.. 2840 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించామని తెలిపారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించడం దేశంలోనే ఇదే ప్రథమమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించినా ఆపదలో ఉన్నవారి కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు.

ఇదీ చూడండి: 'ఆ విషయంలో దిల్లీ, ముంబయితో పోలిస్తే హైదరాబాద్​ నయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.