విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకబోర్డు విషయమై గవర్నర్ సందేహాల నివృత్తికి విద్యాశాఖ సిద్ధమైంది. వివరణ ఇచ్చేందుకు గవర్నర్ సమయం ఇవ్వాలని రాజ్ భవన్‌ను విద్యాశాఖ కోరింది. గవర్నర్ సమయం ఖరారు చేస్తే రాజ్ భవన్ వెళ్లి సందేహాలు నివృత్తి చేసేందుకు విద్యాశాఖ మంత్రి, అధికారులు సిద్ధమయ్యారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకబోర్డు విషయమై కొన్ని సందేహాలు లేవనెత్తిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు.
విద్యాశాఖ మంత్రి, అధికారులను పంపి నివృత్తి చేయించాలని అందులో సూచించారు. సీఎంఓ కార్యాలయం నుంచి విద్యాశాఖకు సంబంధిత లేఖ చేరింది. సందేహాలు నివృత్తి చేసేందుకు సిద్ధమైన విద్యాశాఖ... సమయం ఇవ్వాలని రాజ్ భవన్‌ను కోరింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తాం. ఇప్పటికే గవర్నర్ సమయాన్ని కోరాం. గవర్నర్ తమిళిసై సమయం ఇచ్చాక వెళ్లి కలుస్తా. బిల్లుకు సంబంధించి న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేస్తా.. అన్ని అంశాలను వివరిస్తా.. నిజాం కళాశాల వసతి గృహం వివాదంపై వీసీ, ప్రిన్సిపాల్‌తో మాట్లాడుతున్నాం. విద్యార్థులను పిలిచి మాట్లాడి, న్యాయం చేస్తాం. - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఇవీ చదవండి: