ETV Bharat / state

బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి - బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో మరో 45 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్ సరూర్​నగర్ సర్కిల్​లోని కామేశ్వరరావు కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.

Hyderabad Latest news
Hyderabad Latest news
author img

By

Published : May 22, 2020, 2:41 PM IST

ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిచాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్ సరూర్​నగర్ సర్కిల్​లోని కామేశ్వరరావు కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు.

నిరుపేద ప్రజలకు న్యాయమైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ల సంకల్పంతో జీహెచ్ఎంసీ పరిధిలో.... 123బస్తీ దవాఖానాలు ప్రతి రోజు 10వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. కొత్తగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాలతో.... అదనంగా 4వేల మందికి వైద్య సేవలు అందనున్నాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డితోపాటు స్థానిక కార్పొరేటరు​, పలువురు వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.