జగన్ అక్రమాస్తుల కేసులోని ఇందూ టెక్‌జోన్ అభియోగపత్రం నుంచి తనను తొలగించాలని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఐటీ శాఖ మంత్రిగా రాజ్యంగ, చట్టబద్ధమైన విధులు నిర్వహించానని.. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని సబిత తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. సీబీఐ తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించిందని పిటిషన్లో ప్రస్తావించారు.
ఇందూ టెక్‌జోన్‌లో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఏపీఐఐసీ విశ్రాంత అధికారి పార్థసారధిరావు కోరారు. డిశ్చార్జ్ పిటిషన్ వేయబోమని ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి కోర్టుకు తెలిపారు.
ఇందూ టెక్‌జోన్ ఛార్జిషీట్‌కు సంబంధించిన అన్ని అంశాలపై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది. ఎమ్మార్ అక్రమాలపై సీబీఐ, ఈడీ కేసులపై విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
ఇవీచూడండి: CBN on Jagan: 'జగన్‌ను నమ్ముకున్నోళ్లంతా జైలుకే.. '