ROJA VISIT TIRUMALA : ఆంధ్రప్రదేశ్లో జరిగిన కందుకూరు ఘటన చాలా బాధాకరమని, చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు పొట్టనబెట్టుకున్నాడని మంత్రి రోజా ఆరోపించారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానాలు సుమోటో కేసుగా తీసుకుని చంద్రబాబుపై హత్య కేసు పెట్టాలన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు బలి తీసుకున్నారన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు రూ.2 కోట్లు, క్షతగాత్రులకు కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం కేసులు పెడితే కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు ప్రచారం చేస్తారన్నారు.
"తన షోను సక్సెస్ చేసుకోవడానికి ఎనిమిది మందిని పొట్టనబెట్టుకున్న చంద్రబాబును ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా మీటింగులు పెట్టాలంటే ఖాళీ స్థలాల్లో పెట్టుకుంటారు. కానీ రాత్రుళ్లు చిన్న చిన్న సందులో మీటింగులు పెట్టి జనాలు వచ్చారని చెప్పుకోవడానికి కాదు. మీటింగులు జరిగే దగ్గర భద్రతా చర్యలు చేపట్టడం, ఎవరికైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడం చేయాలి" -రోజా, మంత్రి
ఇవీ చదవండి: