Minister RK Roja: సీఎం జగన్ ఏ కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలు.. బూతుల్లా భూతద్దంలో చూపిస్తున్నాయని.. మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్న.. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో.. ఆమె పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చి వేతపై తప్పుడు సమాచారం ఇచ్చారని.. హైకోర్టు చివాట్లు పెట్టినా.. ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదన్నారు. పవన్ చేసే యాత్రల వల్ల వైసీపీకే మేలు జరుగుతుందని చెప్పారు.
"రిషి కొండలో ఇప్పటికే టూరిజం ఉంది. దానిని జగన్ మోహన్ రెడ్డి మరింత అభివృద్ధి చూస్తున్నారు. టీడీపీ, కమ్యునిస్టు, జనసేన తమ ఉనికిని చాటేందుకే ఇలా చేస్తున్నాయి. పవన్ కల్యాన్ ఇప్పటం, వైజాగ్ రావడం వల్ల వైఎస్ఆర్ పార్టీకే మేలు జరుగుతుంది. అది ప్రజలకు కూడా బాగా అర్థమవుతుంది".-ఆర్కే రోజా, టూరిజం మంత్రి
ఇవీ చదవండి: