ETV Bharat / state

'త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సులు'

Minister Puvvada Ajay Kumar review: రవాణా శాఖలో అందిస్తున్న పౌర సేవలు, ఆన్​లైన్ సేవలు.. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖలో ఆన్​లైన్ సేవలను మరింత విస్తృతం చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

minister
'త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సులు'
author img

By

Published : Sep 26, 2022, 5:47 PM IST

Updated : Sep 26, 2022, 6:33 PM IST

Minister Puvvada Ajay Kumar review: రవాణా శాఖలో అందిస్తున్న పౌర సేవలు, ఆన్​లైన్ సేవలు.. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రవాణా శాఖలో ఆన్​లైన్ సేవలను మరింత విస్తృతం చేయ్యాలని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ తెలిపారు.

రవాణా శాఖలో మరికొన్ని సేవలను ఆన్​లైన్ ద్వారా అందించేందుకు సాధ్యమయ్యే అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఆర్టీసీ రోజువారి ఆదాయ, వ్యయాలపై అధికారులతోమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించారు.

రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్​ కుమార్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 26, 2022, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.