ఖమ్మం జిల్లా కేంద్రంలోని 211వ డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించారు. కరోనా మహమ్మారి దేశాన్ని వదిలిపోయే వరకు ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని... అలాగే ముస్లిం సోదరులు కూడా రంజాన్ పండగను ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు మేయర్ పాపాలాల్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, ప్రశాంతి, లక్ష్మి తదితరులు ఉన్నారు.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'