ETV Bharat / state

కేపీహెచ్​బీలో స్థల వివాదాలను పరిష్కరిస్తాం : పువ్వాడ అజయ్​ - ghmc elections

భద్రత విషయంలో హైదరాబాద్​ను దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన ఘనత కేటీఆర్​దేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ అన్నారు. గ్రేటర్​లో ఎన్నికల్లో కూకట్​పల్లి డివిజన్​లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కేపీహెచ్​బీలోని పలు కాలనీల్లో ఆయన ప్రచారం చేశారు.

Minister puvvada ajay election compaign in kukatpally division in ghmc elections
కేపీహెచ్​బీలో స్థల వివాదాలను పరిష్కరిస్తాం : పువ్వాడ అజయ్
author img

By

Published : Nov 24, 2020, 4:27 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ పేర్కొన్నారు. కూకట్​పల్లి డివిజన్​లోని పలు కాలనీల్లో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రచారం చేపట్టారు. తెరాస అభ్యర్థి మందడి శ్రీనివాస్ తరపున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కేపీహెచ్​బీలోని ఎనిమిది డివిజన్లలో తెరాస అభ్యర్థులనే గెలిపించాలని మంత్రి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం సాయినగర్​లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. జేఎన్టీయూ సమీపంలో ఉన్న భూవివాదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ల ఆధ్వర్యంలో భద్రతలో భాగ్యనగరం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ఇతర నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చూడండి:భాజపా నేతల ఛార్జిషీట్.. గోబెల్స్​ డైరీలా ఉంది : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.