ETV Bharat / state

బడ్జెట్ సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయి: ప్రశాంత్‌రెడ్డి - తెలంగాణ వార్తలు

బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సభ్యులు సహకరించారని తెలిపారు. సభకు అంతరాయం కలిగించకుండా నిర్మాణాత్మక చర్చలకే ప్రాధాన్యత ఇచ్చిన పాలక, ప్రతిపక్ష సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

minister prashant reddy about budget sessions, telangana budget sessions latest news
బడ్జెట్ సమావేశాలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు తాజా వార్తలు
author img

By

Published : Mar 26, 2021, 7:26 PM IST

బడ్జెట్ సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆద్యంతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జరిగాయని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉభయసభలు సజావుగా సాగాయని... అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసేలా భారీ బడ్జెట్​ను సభలు ఆమోదించాయని వెల్లడించారు.

హుందాతనానికి నిదర్శనం

సభ్యులందరికీ సభాపతులు అవకాశాలిచ్చారని... ప్రతిపక్ష సభ్యులకు అడిగినంత సమయం లభించిందన్నారు. దీనిని బట్టి అసెంబ్లీ సమావేశాలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా సాగాయో తెలుస్తోందని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సభకు అంతరాయం కలిగించకుండా నిర్మాణాత్మక చర్చలకే ప్రాధాన్యత ఇచ్చిన పాలక, ప్రతిపక్ష సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దేశానికే ఆదర్శం

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ చట్ట సభలు దేశానికే ఆదర్శంగా మారాయని అన్నారు. అదే ఒరవడి ఈ సమావేశాల్లోనూ కొనసాగిందని తెలిపారు. మండలిలో కీలక ప్రకటనలు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం వంటి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:'పరీక్షలు లేకుండా పాస్ చేయలేం.. రెండ్రోజుల్లో హాల్ టికెట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.