Minister Ponnam Fires on BRS : బీఆర్ఎస్ పార్టీ మహిళలు ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించడాన్ని వ్యతిరేకిస్తున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రశ్నించారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్ పూర్లోని ప్రజాపాలన 6 గ్యారంటీల అభయహస్తం దరఖాస్తుల పంపిణీ కేంద్రాన్ని మంత్రి పొన్నం, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ రోనాల్డ్ రోస్, రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి వివరించారు.
Minister Ponnam Comments On BRS : రాష్ట్రంలో లక్షలాదిమంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని మంత్రి పొన్నం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి సహించలేక బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతోంటే గులాబీ నేతలు సహించలేకపోతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంటే వారు చూడలేకపోతున్నారని మండిపడ్డారు.
వరదసాయం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం: రేవంత్‌రెడ్డి
"ఎన్నికల ఫలితాలు వచ్చి కేవలం నెల రోజులు మాత్రమే అవుతుంది. ఈ నెల రోజుల్లో రెండు గ్యారంటీలు అమలు చేశాం. మిగితా గ్యారంటీలకు దరఖాస్తుల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చి నెలరోజులు కాకుండానే కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ సమయంలోనే ఆటంకం కల్గిస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది." - పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పారిశ్రామిక రంగంలో మహిళలను మరింత ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Ponnam On Praja Palana : రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలనలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని వెల్లడించారు. మరో మూడ్రోజులు మాత్రమే అవకాశం ఉండటంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేక ఆటో కార్మికులతో హైదరాబాద్‌లో ధర్నాలు చేయిస్తోంది. ఈ ఉచిత ప్రయాణం బీఆర్ఎస్కు నచ్చకనే ఆటో కార్మికులతో ధర్నాను పోత్సహిస్తోందా? ఆటో కార్మికులారా ప్రతిపక్షాల వలలో పడకండి. వ్యక్తిగత కారణాలతో పార్టీలు ప్రజలకు మేలు చేకూర్చే పథకాలను ఆపే ప్రయత్నం చేయొద్దు. ప్రజాపాలనకు దరఖాస్తులు వెల్లువలా వస్తుంటే బీఆర్ఎస్కు నిద్ర పట్టడం లేదు. - పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పెండింగ్‌లో రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో, కొత్త మార్గాలపై సర్వేకు నిర్ణయం
సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అక్కినేని నాగార్జున దంపతులు