Minister Ponguleti Srinivas Reddy Meeting with Collectors : ప్రజాపాలన కార్యక్రమానికి ఈనెల 28న శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించి ఆరుగ్యారంటీలకు దరఖాస్తుతో వినతులు, ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దరఖాస్తును ముందు రోజే గ్రామాలకు పంపించాలని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ కోసం రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఆరు గ్యారంటీలకు తెల్లరేషన్ కార్డునే అర్హతగా తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్‌రెడ్డి సమావేశం - ప్రజాపాలన, ఆరు గ్యారంటీల అమలుపై చర్చ
Congress Government Conduct Grama Sabha : ప్రజాపాలన కార్యక్రమం ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలన ఉద్దేశాలు, నిర్వహణ తీరును కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, అదనపు కలెక్టర్ల సదస్సులో సీఎం వివరించారు. అధికారులు రెండు బృందాలుగా ఏర్పడాలని ఒక్కో బృందం రోజుకు రెండు గ్రామాల్లో ప్రజా సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి(Revanth Reddy Meeting with Collectors) చెప్పారు. ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి ఇంచార్జిగా, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి ప్రజాపాలనను పర్యవేక్షిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు : సీఎం రేవంత్ రెడ్డి
Ponguleti Srinivas Reddy on six Guarantees : గ్రామ సభకు ముందు రోజునే దరఖాస్తులను అక్కడికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చెప్పారు. రద్దీ, తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామసభ ప్రారంభం కాగానే ముందుగా ప్రభుత్వ ఉద్దేశాలను చదివి వినిపించాలని చెప్పారు. దరఖాస్తులో ఆధార్, రేషన్ కార్డు, క్రిమినల్ కేసులు తదితర వివరాలు నింపాల్సి ఉంటుందని సీఎం వివరించారు. సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపిస్తే అర్హులకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సభల నిర్వహణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు.
"ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తాం. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారి నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటాం. గూడెంలో 10 ఇళ్లు ఉన్నా అధికారులు వెళ్లాలి. భూ సంబంధిత అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ చర్చించారు. ధరణి పోర్టల్ ద్వారా గత పాలకులు భూములు కబ్జా చేశారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేశాం. గత ప్రభుత్వం పథకాల్లో కోత పెట్టినట్లు మేం పెట్టం."- పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి
కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్తారు : పొంగులేటి
Revanth Reddy Meeting with Collectors and SPs : ఆరుగ్యారంటీలకు(Congress Six Guarantees) తెల్లరేషన్ కార్డునే ప్రాథమికంగా అర్హతగా పరిగణిస్తున్నట్లు రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అయితే ఆ సమయంలో సమర్పించలేక పోయిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. అర్హులైన ప్రతీఒక్కరి నుంచి తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజల మధ్యకు వచ్చేందుకు సంకోచించే జాతులు ఉన్న చోట అక్కడికే అధికారులు వెళ్లాలని చెప్పినట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ కోసం రూ.25 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. ఈ నిధులతో గ్రామ, వార్డు సభల్లో మంచినీరు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.
ధరణి పోర్టల్ ప్రక్షాళన మొదలైంది - వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : పొంగులేటి