కొవిడ్ సంక్షోభం కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు వారి వద్దకే వెళ్లి పాఠాలు బోధించేందుకు సేవ్ ది చిల్డ్రన్ సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ లెర్నింగ్ సెంటర్‌ను తీసుకొచ్చారు. మొబైల్ లెర్నింగ్ సెంటర్ వాహనాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఆటపాటలతో పిల్లలకు విద్య బోధించేలా మొబైల్ లెర్నింగ్ సెంటర్‌ను సంస్థ సభ్యులు తీర్చిదిద్దారు. ప్రత్యేక వాహనంలో గ్రామాలకు వెళ్లి అక్కడి పాఠశాల ఆవరణలో విద్యార్థులకు.. పుస్తకాలు, ఆట పరికరాలతో పాఠాలను బోధిస్తారు. చిన్నారులను ఆకట్టుకునేలా టీవీల్లో డిజిటల్ అంశాలతోనూ వివరిస్తారు. అంగన్ వాడీ, ఫ్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వర్క్‌బుక్‌లను తయారు చేసినట్లు సేవ్ ది చిల్డ్రెన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, పాఠశాల విద్యా సంచాలకురాలు దేవసేన పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఫిట్‌మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా: బండి సంజయ్