ETV Bharat / state

MINISTER NIRANJAN REDDY: యాసంగిలో వేరుశనగ ప్రధాన పంట కావాలి..! - telangana 2021 news

యాసంగిలో వేరుశనగనే ప్రధాన పంట కావాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావుతో కలిసి వేరుశనగ సాగు, దిగుబడుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

minister-niranjan-reddys-review-meeting-on-groundnut-cultivation-and-yield-increase
యాసంగిలో వేరుశనగ ప్రధాన పంట కావాలి..!
author img

By

Published : Aug 6, 2021, 2:31 PM IST

యాసంగిలో వేరుశనగ ప్రధాన పంట కావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వేరుశనగ సాగు, దిగుబడుల పెంపుపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో మంత్రి సమీక్షించారు. ఉత్పత్తి, మార్కెటింగ్, ఇతర ప్రోత్సాహాలపైనా మంత్రి చర్చించారు. వేరుశనగ నాణ్యత, దిగుబడులు పెరగాలని సూచించారు. రూ.9 కోట్లతో వేరుశనగ పరిశోధనకు ప్రత్యేక పథకం ఏర్పాటు చేస్తామన్నారు.

ఇక్రిశాట్ సహకారంతో వేరుశనగ వంగడాల రూపకల్పనకు పరిశోధనలు చేయాలని.. వైరస్‌లను తట్టుకునే కొత్త రకాలను రూపొందించాలని సూచించారు. పరిశోధనలో యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి నిరంజన్‌రెడ్డి.. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: Hashish Oil: హైదరాబాద్​లో 'హాషీష్‌ ఆయిల్‌'... పోలీసులకు సవాల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.