ETV Bharat / state

సేంద్రియ సేద్యంతోనే కల్తీలేని ఆహారం: నిరంజన్​రెడ్డి

రాష్ట్రంలో సేంద్రియ సాగు ద్వారా వ్యవసాయంలో నూతన మార్పులు చోటుచేసుకుంటాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సేంద్రియ సాగు విధానం ద్వారా కల్తీలేని ఆహారం పొందవచ్చని స్పష్టం చేశారు. టీ శాట్ ఛానల్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై జరిగిన చర్చ, రైతుల సందేహాలకు మంత్రి సమాధానాలు తెలిపారు.

author img

By

Published : May 24, 2021, 9:00 PM IST

minister niranjan reddy
సేంద్రీయ సేద్యంతోనే కల్తీలేని ఆహారం: నిరంజన్​రెడ్డి

రాష్ట్రంలో సేంద్రియ సాగు ద్వారా వ్యవసాయం కొత్త పుంతలు తొక్కాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న దృష్ట్యా టీ శాట్ ఛానల్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై జరిగిన చర్చ, రైతుల సందేహాలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ-అగ్రోస్ ఎండీ రాములు, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ అనిత, సుస్థిర వ్యవసాయ కేంద్రం సీఈఓ డాక్టర్ జీవీ రామాంజనేయులు పాల్గొన్నారు.

సేంద్రియ పంటలపై ప్రజల్లో బాగా ఆసక్తి పెరిగిన నేపథ్యంలో శుద్ధమైన ఆహారం అందించడానికి ప్రపంచ ఆలోచనా విధానం మారాలని మంత్రి సూచించారు. సాధారణ పంటల కన్నా సేంద్రియ పంటలకు అధిక ధర చెల్లించి కొంటున్నందున ఈ సేద్యంపై మరింత చర్చ జరగాలన్నారు. పల్లెప్రగతి కింద గ్రామ పంచాయతీల్లో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీని ప్రోత్సహిస్తున్నామని... ఒక్క హైదరాబాద్‌లోనే రోజూ 6600 టన్నుల వ్యర్థాలు వస్తున్నందున "సిరి కంపోస్ట్" ఎరువుగా మార్చి రైతులకు అందించే యత్నం చేస్తున్నామని తెలిపారు.

పట్టణీకరణ వల్ల సూర్యరశ్మి, గాలి పట్టణ వాసులకు సరిగా అందడం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు సైతం ఇదే అంశం చెబుతున్నారని... గాలి, సూర్యరశ్మి, తినే ఆహారం నుంచే మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పుకొచ్చారు. పట్టణ వాసులతోపాటు గ్రామీణులకు కూడా నాణ్యమైన ఆహారం అందడం లేదని చెప్పారు. కల్తీలేని ఆహారం వల్లే మన పూర్వీకులు, పెద్దలు రోగాల బారిన పడకుండా ఎక్కువ కాలం జీవించగలిగారు... ఇంకా కూడా జీవించగలుగుతున్నారని గుర్తు చేశారు.

వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో రసాయనాలు, ఎరువుల వాడకం పెరగడం వల్లే నాణ్యమైన ఆహారం లభించకపోవడమే కాకుండా అధిక ఎరువుల మూలంగా భూమి సారం కోల్పోయి కలుషితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రసాయనాలు, ఎరువులతో భూమి నిస్సారమై మృతభూమిగా మారిన తరుణంలో... ఆ సమస్య నుంచి అధిగమించేందుకు ఆకులు, పెంట, చెరువుల్లో ఒండ్రు పొలాల్లో వేసి కలియదున్నడం వల్ల భూమి సారం పెరుగుతుందని అన్నారు. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ... రోగ నిరోధక శక్తి కాలానుగుణంగా మనుషుల్లో తగ్గడం వల్లే వ్యాధుల బారిన పడుతున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కరోనా సోకిన విద్యార్థులను పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.