ETV Bharat / state

సాంప్రదాయ పంటల సాగువైపు రైతులను మళ్లించాలి: మంత్రి - rabi season

హైదరాబాద్​ నాంపల్లిలోని హాకా భవన్​లో వ్యవసాయ, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. సాంప్రదాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించాలని అధికారులకు మంత్రి సూచించారు.

సాంప్రదాయ పంటల సాగువైపు రైతులను మళ్లించాలి: మంత్రి
author img

By

Published : Nov 13, 2019, 11:50 PM IST

రాష్ట్రంలో సాంప్రదాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి హాకా భవన్‌లో రాయితీ విత్తనాల సరఫరా, ఎరువులు, ప్రభుత్వ పథకాలు, పంటల మార్పిడి తదితర అంశాలపై వ్యవసాయ, మార్క్‌ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ రబీ కోసం వేరుశనగ విత్తనాల సరఫరా పూర్తైన దృష్ట్యా శనగ విత్తనాలు ఎంత అవసరమైతే... అంత మేరకు రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి నిరంజన్‌రెడ్డి... ఉన్నతాధికారులను ఆదేశించారు.

రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలి..

ప్రాజెక్టులు, చెరువుల్లో పుష్కలంగా సాగు నీరు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రబీ సీజన్‌లో గతం కన్నా ఎక్కువగా వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్న ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితమైన అంచనాలతో వరి విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని మంత్రి సూచించారు. పంట మార్పిడి కింద నువ్వుల పంటను ప్రోత్సహిస్తూ రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

రబీకి సరిపడ ఎరువులు అందుబాటులో ఉంచాలి

రసాయన ఎరువులు రైతులు అవసరానికి మించి వినియోగించకుండా అధికారులు చైతన్యపరిచేందుకు ఊరూరా అవగాహనా సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఈ రబీకి సరిపడా ఎరువులు తగినంతగా అందుబాటులో ఉంచాలని చెప్పారు. డిసెంబరు 15 నాటికి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మార్క్‌ఫెడ్‌ వద్ద బఫర్ స్టాక్ కింద నిల్వలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతుబీమా పథకం కింద రావల్సిన నిధులు పది రోజుల్లో అందేలా ఎల్ఐసీ అధికారులతో మాట్లాడాలని మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

సాంప్రదాయ పంటల సాగువైపు రైతులను మళ్లించాలి: మంత్రి

ఇవీ చూడండి: పాలమూరులో యథేచ్ఛగా మట్టి దందా

13-11-2019 TG_HYD_70_13_MINISTER_REVIEW_ON_RABI_SEED_SCHEMES_AV_3038200 REPORTER : MALLIK.B Note : vedio and pics from desk whatsApp ( ) రాష్ట్రంలో సాంప్రదాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి హాకా భవన్‌లో రాయితీ విత్తనాల సరఫరా, ఎరువులు, ప్రభుత్వ పథకాలు, పంటల మార్పిడి తదితర అంశాలపై వ్యవసాయ, మార్క్‌ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, కమిషనర్ రాహుల్ బొజ్జ, టీఎస్ మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రబీ కోసం వేరుశనగ విత్తనాల సరఫరా పూర్తైన దృష్ట్యా శనగ విత్తనాలు ఎంత అవసరమైతే... అంత మేరకు రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి నిరంజన్‌రెడ్డి... ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, చెరువుల్లో పుష్కలంగా సాగు నీరు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రబీ సీజన్‌లో గతం కన్నా ఎక్కువగా వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్న ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితమైన అంచనాలతో వరి విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని మంత్రి సూచించారు. పంట మార్పిడి కింద నువ్వుల పంట ప్రోత్సహిస్తూ రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో విస్తృతంగా సాగు చేసిన సాంప్రదాయ పంటలైన పొద్దుతిరుగుడు, కుసుమ తదితర పంటల వైపు రైతులను మళ్లించే విధంగా విత్తనాలు అందుబాటులో ఉంచి క్షేత్రస్థాయి అధికారులతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని అన్నారు. రసాయన ఎరువులు రైతులు అవసరానికి మించి వినియోగించకుండా అధికారులు చైతన్యపరిచేందుకు ఊరూరా అవగాహనా సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఈ రబీకి సరిపడా ఎరువులు తగినంతగా అందుబాటులో ఉంచాలని చెప్పారు. డిసెంబరు 15 నాటికి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మార్క్‌ఫెడ్‌ వద్ద బఫర్ స్టాక్ కింద నిల్వలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతుబంధు బీమా పథకం కింద క్లెయింలు పది రోజుల్లో అందేలా ఎల్ఐసీ అధికారులతో మాట్లాడాలని మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. VIS..........
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.