ETV Bharat / state

రైతులకు శుభవార్త: రూ.210 కోట్ల బకాయిలు విడుదల

author img

By

Published : Jun 30, 2020, 8:09 PM IST

అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత యాసంగి మార్కెట్‌ సీజన్​కు‌ సంబంధించిన జొన్న, మొక్కజొన్న, శనగపప్పు, పొద్దుతిరుగుడు పంటల బకాయిలు మొత్తం రూ.210 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

minister-niranjan-reddy-daid-that-210-crore-dues-release-to-farmers-in-telangana

గత యాసంగి మార్కెట్‌ సీజన్​కు సంబంధించిన జొన్న, మొక్కజొన్న, శనగపప్పు, పొద్దుతిరుగుడు పంటల బకాయిలు మొత్తం రూ.210 కోట్లు విడుదలయ్యాయి. మొక్కజొన్న రూ.198.23 కోట్లు, శనగపప్పు రూ.4.09 కోట్లు, జొన్న రూ.5.69 కోట్లు, పొద్దు తిరుగుడు రూ.2.48 కోట్ల చొప్పున బకాయిలు విడుదలయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

ఆ మొత్తం రూ.210 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. కెనరా బ్యాంకు నుంచి టీఎస్‌ మార్క్‌ఫెడ్‌ సంస్థకు రూ.వెయ్యి కోట్లు విడుదలయ్యాయని.. అన్నదాతల బకాయిల చెల్లింపు ప్రక్రియ పూర్తయిందన్నారు.

చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో మద్దతు ధరకు 9,42,943.600 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామని నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. 35,934 మెట్రిక్ టన్నుల శనగపప్పు, 18,487 మెట్రిక్ టన్నుల జొన్న, 4,493 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు కొనుగోలు చేశామన్నారు.

కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు... ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొనుగోళ్లు చేశామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ గ్యారంటీతో రూ.3,213 కోట్లు రుణంగా మార్క్‌ఫెడ్‌కు ఇచ్చేందుకు గతంలోనే బ్యాంకులు అంగీకారం తెలిపాయని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.