ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
వర్ష బీభత్సంతో నిరాశ్రయులైన వారికి రూ.పదివేల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. పాత బోయిన్పల్లి డివిజన్లోని ఆరు వందల కుటుంబాలకు రూ.10వేల చొప్పున నగదును మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు.
వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మరో మూడ్రోజుల పాటు వర్షాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఇదీ చదవండి: సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం: మంత్రి సబితా