వాహకులు తప్పనిసరిగా టీకాను వేసుకోవాలని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో టీకా కేంద్రాన్ని(vaccination center) ప్రారంభించారు. తెరాస మల్కాజిగిరి పార్లమెంటు బాధ్యులు మర్రి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో లోక ఫౌండేషన్ సహకారంతో పలువురికి కొవిడ్ సేఫ్టీ కిట్ల పంపిణీ చేశారు.
అలాగే రూ. 70 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇంటింటా జ్వరం సర్వే చేయిస్తోందని వెల్లడించారు. జిల్లా మంత్రిగా కరోనా నివారణకు తన వంతుగా కృషి చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో అవసరం చోట్ల ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: Harish rao: మీరు ఇవ్వరు.. మమ్మల్ని కొనుగోలు చేయనివ్వరు