సికింద్రాబాద్లోని బోయిన్పల్లి వాసులకు మంత్రి మల్లారెడ్డి... కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
"మూడో ప్రపంచ యుద్ధంలా దేశానికి కరోనా వచ్చింది. దీనిని ఎదుర్కోవాలంటే అందరూ లాక్డౌన్ను కచ్చితంగా పాటించి... ఇంట్లోనే ఉండాలి. వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం సఫలీకృతమవుతుంది. ఎవరూ భయాందోళనలకు గురికావద్దు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేద ప్రజల కడుపు నింపేందుకు ముందుకు వస్తున్న వారందరికి ఇవే నా కృతజ్ఞతలు. మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నా."
-మంత్రి మల్లారెడ్డి
ఇవీచూడండి: ఒకటికి రెండుసార్లు కొవిడ్-19 నిర్ధరణ