నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మితే వ్యాపారస్తుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ద్విచక్రవాహనంపై తిరుగుతూ కూరగాయలు ధరలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాల విషయంలో ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి , సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని, ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని మంత్రి కోరారు.
ఇదీ చూడండి: కరోనా పనిపట్టాలి.. వారు ఎవరిని కలిశారో కనిపెట్టాలి