అతి త్వరలోనే మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని... పురపాలక మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఎంసీఆర్హెచ్ఆర్డీలో గ్రేటర్లో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని... పనులు ఇంకా వేగవంతంగా చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్నిచోట్ల లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని ఆయన వివరించారు.
ఈ సమీక్షకు మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ హాజరయ్యారు.
ఇదీ చూడండి: ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు కీలక పదవి