ETV Bharat / state

ఎంత పెద్ద నాయకుడైనా.. ఇంట్లో బాస్‌కు భయపడాల్సిందే: కేటీఆర్ - we Hub 5th Anniversary

Minister KTR in we Hub 5th Anniversary మహిళా పారిశ్రామిక వేత్తల కోసం కొత్త సింగిల్‌ విండో పాలసీ విధానాన్ని తీసుకువస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వీ-హబ్‌ ఐదో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌.. మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. వీ హబ్‌ ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలు ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు.

Minister KTR
Minister KTR
author img

By

Published : Mar 8, 2023, 12:54 PM IST

Updated : Mar 8, 2023, 1:10 PM IST

వీ-హబ్‌ ఐదో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌

Minister KTR in we Hub 5th Anniversary మండల స్థాయి నుంచి ఔత్సాహిక మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు వీలుగా సింగిల్‌ విండో విధానాన్ని తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని వీ-హబ్‌ ఐదో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ వేడుకలు హోటల్ తాజ్ కృష్ణా వేదికగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్... పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

Minister KTR Comments on women సింగిల్‌ విండో పద్ధతితో పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. విద్యార్థినులు, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేటీఆర్‌ తెలిపారు. వీ హబ్‌ ద్వారా మహిళలు ఎదగటమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించటం సంతోషకరమన్నారు.

'' రూ.1.30కోట్లు ఇస్తే వి హబ్ నుంచి ఒక స్టార్టప్‌తో రూ.70 కోట్లకు పెంచారు. స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నాం. రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నాం. యువత ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదు..? ప్రతీ పారిశ్రామిక పార్క్‌లలో 10 శాతం ప్లాట్స్ మహిళలకు కేటాయించాం. ప్రతీ 3 కొవిడ్‌ టీకాల్లో రెండు హైదరాబాద్‌ నుంచి వచ్చాయి. మహిళా వ్యాపారులకు సింగల్ విండో విధానం అమలు చేస్తాం.'' - కేటీఆర్‌, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి

Minister KTR Comments on gender discrimination అమ్మాయి తక్కువ అనే భావన ఇంటి నుంచే నేర్పుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మానవ వనరులు, సాంకేతికత సద్వినియోగంతో అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మెళకువలు నేర్పాలన్న మంత్రి కేటీఆర్... ఆలోచించే విధానంలో మార్పు రావాలని తెలిపారు. తప్పు జరిగితే మళ్లీ నేర్చుకుంటాం... వెనుకాడవద్దని సూచనలు చేశారు.

''నన్ను, నా చెల్లిని బాగా చదివించారు. నా చెల్లి యూఎస్ వెళ్తా అంటే నా కంటే ముందే పంపారు. మా పిల్లలకు కూడా సమానంగా ట్రీట్ చేస్తున్నాం. పడిపోతే మేం ఉన్నాం అన్న ధైర్యం ఇస్తున్నాం. నా కుమార్తె 9వ తరగతి చదువుతుంది. తను మంచి ఆర్టిస్ట్ అవుతుంది అనుకుంటున్నా... ఆమె ఇప్పటికే పుస్తకాలు రాసింది. మ్యూజిక్‌ని ఇష్టపడుతుంది. నా కూతురు ఏం అయినా సరే మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటున్నా. మహిళలు ఎక్కువ నిబద్ధత.. ఎక్కువ ఫోకస్డ్‌గా, బాధ్యయుతంగా ఉంటారు. మేం బయటకి ఎంత నటించినా... ఇంట్లో మీరే బాస్‌లు. ఎంత పెద్ద నేత అయినా ఇంటికి వెళ్లాక బాస్‌కు భయపడాల్సిందే.'' - కేటీఆర్ ,పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి

ఇవీ చూడండి:

Last Updated : Mar 8, 2023, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.