ETV Bharat / state

కరోనా కట్టడిలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి : కేటీఆర్​

కరోనా నియంత్రణకు అధికారులు పకడ్బందీగా వ్యవహరించారని... ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని మంత్రి కేటీఆర్​ తెలిపారు. పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ దృశ్య మాధ్యమ సమీక్షను నిర్వహించారు. వర్షాకాల ప్రణాళికలపై చర్చించారు.

author img

By

Published : May 9, 2020, 1:48 PM IST

కేటీఆర్​
కేటీఆర్​

భౌతిక దూరం పాటించడం, మాస్కుల, శానిటైజర్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు మునిసిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ సూచించారు. పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ దృశ్య మాధ్యమ సమీక్షను నిర్వహించారు. వర్షాకాల ప్రణాళికలపై చర్చించారు. రూ. 830 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన పనులపై నివేదిక వెంటనే ఉన్నతాధికారులకు పంపాలని ఆదేశించారు.

మునిసిపల్​ కమిషనర్లకు అభినందనలు...

కరోనా కట్టడిలో కీలక పాత్ర వహిస్తున్న మునిసిపల్​ కమిషనర్లను కేటీఆర్​ అభినందించారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా వ్యాప్తి చెందకుండా మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. పట్టణాల్లో సరి, బేసి విధానంలో దుకాణాల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. కరోనా కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్య, పురపాలక శాఖలు ఈ రోజే విడుదల చేస్తాయని కేటీఆర్ వెల్లడించారు.

సీజనల్​ వ్యాధుల నివారణకు ప్రణాళికలు...

వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ వంటి సీజనల్​ వ్యాధుల నివారణ కోసం ఇప్పట్నుంచే చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. యాంటీ లార్వా యాక్టివిటీస్ కోసం గతంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని రేపట్నుంచి తిరిగి ప్రారంభించాలన్నారు. డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్నారు. పురపాలక శాఖ, ఆరోగ్య శాఖ కలిసి రూపొందించిన సీజనల్ వ్యాధుల క్యాలెండర్ ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

పారిశుధ్ద్య సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు...

పారిశుద్ధ్య కార్మికులకు వారానికోమారు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయాలని తెలిపారు. వారు రక్షణ కవచాలు, మాస్కులు, బ్లౌజులు ధరించేలా చూడాలన్నారు. రక్షణ కవచాలు లేకుండా కార్మికులు క్షేత్రస్థాయిలో కనిపిస్తే పూర్తి బాధ్యత మునిసిపల్ కమిషనర్లదేనని పేర్కొన్నారు. మ్యాన్​ హోల్స్​ మరమ్మతులు పూర్తి చేయాలని, మురికి కాలువల్లోని చెత్తను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాటు సిద్ధం చేసుకుని అమలు చేయాలన్నారు.

అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష

ఇవీచూడండి: ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.