Minister KTR USA Tour Latest Updates : రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్..తాజాగా జాప్ కామ్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమెరికాకు చెందిన ప్రాడక్ట్ ఇంజినీరింగ్, సొల్యూషన్స్ సంస్థ అయిన జాప్‌కామ్.. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాప్ కామ్ సీఈవో కిషోర్ పల్లంరెడ్డి సహా ఆ సంస్థ ప్రతినిధులు, మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. పర్యాటకం, ఆతిథ్యం, ఫిన్‌టెక్, స్థిరాస్తి రంగాలకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సేవలు అందిస్తుంది. దీని ద్వారా తొలుత 500 మందికి ఉపాధి లభించనుంది. ఏడాది కాలంలో ఈ సంఖ్య వెయ్యికి పెరుగుతుందని జాప్‌కామ్ సంస్థ ప్రకటించింది.
-
During the round table discussion, Minister @KTRBRS proudly shared that Telangana has achieved a remarkable feat by winning the Best State awards for Aerospace for three consecutive years in 2018, 2020, and 2022. Hyderabad was also ranked No 1 Aerospace city of Future in Cost… pic.twitter.com/vaJmvSxdXm
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">During the round table discussion, Minister @KTRBRS proudly shared that Telangana has achieved a remarkable feat by winning the Best State awards for Aerospace for three consecutive years in 2018, 2020, and 2022. Hyderabad was also ranked No 1 Aerospace city of Future in Cost… pic.twitter.com/vaJmvSxdXm
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2023During the round table discussion, Minister @KTRBRS proudly shared that Telangana has achieved a remarkable feat by winning the Best State awards for Aerospace for three consecutive years in 2018, 2020, and 2022. Hyderabad was also ranked No 1 Aerospace city of Future in Cost… pic.twitter.com/vaJmvSxdXm
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2023
డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు రౌండ్ టేబుల్ సమావేశం..: వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల రౌండ్ టేబుల్ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అమెరికాకు చెందిన పలు సంస్థలు, అంకురాలు, వాటి ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏరోస్పేస్ రంగం వృద్ధి, డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదలను కేటీఆర్ వారికి వివరించారు.
ఈ సందర్భంగా యూఎస్ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్న మంత్రి.. ఈ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. 2018, 2020, 2022లో ఏరోస్పేస్ రంగంలో ఉత్తమ రాష్ట్రంగా అవార్డులు గెలుచుకోవడం గర్వకారణమన్న కేటీఆర్.. 2020-21 ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్‌డీఐ ర్యాంకింగ్స్‌లో 'ఏరోస్పేస్ సిటీ ఆఫ్ ఫ్యూచర్'గా హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
మైలురాయిగా డిస్కవరీ..: కేటీఆర్ అమెరికా పర్యటనలో అతి పెద్ద పెట్టుబడి డిస్కవరీ సంస్థతో జరిగింది. తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ రంగంలోకి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఎంట్రీ ఇస్తుందని కేటీఆర్ తెలిపారు. న్యూయార్క్‌లోని డిస్కవరీ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యి ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి డిస్కవరీ రంగ ప్రవేశం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ హబ్‌గా ఐడీసీని డిస్కవరీ ఏర్పాటు చేస్తుందని మంత్రి అన్నారు.
ఇవీ చదవండి:
- Ocugen company investments in telangana : భాగ్యనగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. కేటీఆర్ వెల్లడి
- Incredible Husk Investment : తెలంగాణలో రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకు హస్క్ సంస్థ గ్రీన్‌సిగ్నల్
- KTR on Investment Roundtable Meeting : 'తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది'
- Foxconn Industry in Telangana : 'ఫాక్స్‌కాన్‌తో 35 వేల మందికి ఉపాధి'