ETV Bharat / state

ఆన్​లైన్​ విద్యలో టీసాట్​ ఛానళ్లు ప్రథమ స్థానంలో నిలవాలి: కేటీఆర్​ - KTR_Tsat_Review

టీసాట్​ నెట్​వర్క్​పై అధికారులతో మంత్రి కేటీఆర్​ సమీక్ష నిర్వహించారు. ఆన్​లైన్​ బోధనలో నాణ్యమైన కంటెంట్​ అందించేలా విద్యాశాఖ, టీసాట్​ నెట్​వర్క్​ సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఆన్​లైన్​ విద్యలో టీసాట్​ నెట్​వర్క్​ ఛానళ్లు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని కేటీఆర్​ అన్నారు.

minister ktr tsat review with officers
ఆన్​లైన్​ విద్యలో టీసాట్​ నెట్​వర్క్​ ఛానళ్లు ప్రథమ స్థానంలో నిలవాలి: కేటీఆర్​
author img

By

Published : Jun 20, 2020, 7:25 PM IST

రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి టీసాట్ నెట్​వర్క్ ఛానళ్లు అందుబాటులో ఉండాలని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సూచించారు. ఆన్​లైన్ బోధనలో నాణ్యమైన కంటెంట్ అందించేలా విద్యాశాఖ, టీసాట్ నెట్​వర్క్ సమన్వయంతో పనిచేయాలని మంత్రి తెలిపారు. టీసాట్ నెట్ వర్క్​పై మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యాబోధన ఆనందభరితంగా, ఆహ్లాదకరంగా ఉండేలా కంటెంట్ రూపొందించాలని... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆన్​లైన్ విద్యలో టీసాట్ నెట్ వర్క్ ఛానళ్లు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్​ను అనుసరించి విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా విద్యా బోధన ఉండాలన్న మంత్రి... అందుకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో ఎటువంటి సహకారం కావాలో తెలపాలని అన్నారు.

ఇప్పటికే విద్యార్థులు, నిరుద్యోగులకు పాఠ్యాంశాల బోధన, అవగాహన ప్రసారాలకు సంబంధించి టీసాట్ విద్యా, నిపుణ ఛానళ్లు మంచి ఫలితాలు సాధించాయని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. శాటిలైట్ ప్రసారాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ గత మూడేళ్లుగా ప్రసారాలు అందుబాటులో ఉన్నాయని, యూట్యూబ్​లో ఇప్పటి వరకు లభించిన 53.8 మిలియన్ వీక్షణలు ఛానళ్ల ప్రాధాన్యతను తెలియస్తున్నాయని కేటీఆర్ వివరించారు. డీటీహెచ్, కేబుల్, ఆర్వోటీ, ఓటీటీ వంటి ప్రసార మార్గాలన్నింటిలోనూ టీసాట్ నెట్ వర్క్ ఛానళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్​లో ఆన్​లైన్ బోధనకే ప్రాధాన్యత పెరగనున్న దృష్ట్యా అవసరమైతే మరిన్ని ఛానళ్లు ఏర్పాటు చేసేందుకు సిద్దమవ్వాలని ఆదేశించారు. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులతో కలిసి పనిచేసేలా సంయుక్త కార్యాచరణ రూపొందించాలని, అందులో భాగంగా విద్యాశాఖతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్​.. కర్నల్‌ కుటుంబానికి పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.